logo

అభివృద్ధి వైపే మా అడుగులు..

కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలకు ఊపిరిలూదుతూ... కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. శుక్రవారం నూతన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది.. 

Published : 21 Jun 2024 04:24 IST

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నేడు 

కోటి ఆశలు.. కొంగొత్త ఆకాంక్షలకు ఊపిరిలూదుతూ... కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. శుక్రవారం నూతన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది.. 
‘‘... అనే నేను’’ అంటూ శాసనసభ సాక్షిగా త్రికరణ శుద్ధి శాసనసభ్యులు ప్రమాణం చేయనున్నారు. ఎమ్మెల్యేలుగా తమ నియోజకవర్గ ప్రగతికి.. అందరికీ సుజలాలు.. 
అపురూప దారులు.. పేదకు గూడు.. యువతకు తోడుగా నిలుస్తామని ప్రతిన బూనుతున్నారు. పుష్కల ఉపాధికి.. మహిళా సాధికారతకు.. కృషి చేస్తామని ఎన్టీఆర్‌ జిల్లా ఎమ్మెల్యేలు వారి ఆశయాలను తెలియజేస్తున్నారిలా...

తొలిసారి..

మ్మడి కృష్ణా జిల్లాలో ఆరుగురు తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు. వీరిలో పామర్రు నుంచి వర్ల కుమార్‌రాజా, గుడివాడ నుంచి వెనిగండ్ల రాము, విజయవాడ పశ్చిమ నుంచి సుజనా చౌదరి, తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు, గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు, పెడన నుంచి కాగిత కృష్ణప్రసాద్‌ ఉన్నారు. 


రెండోసారి..

పెనమలూరులో బోడేె ప్రసాద్, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర, నందిగామలో తంగిరాల సౌమ్య, మైలవరంలో వసంత కృష్ణప్రసాద్, విజయవాడ మధ్యలో బోండా ఉమామహేశ్వరరావులు గెలుపొందారు. వీరంతా గతంలో శాసనసభ్యులుగా చేసి.. రెండో విడత అధ్యక్షా అననున్నారు.


మూడోసారి..

గ్గయ్యపేట నుంచి ఇప్పటికే తెదేపా తరఫున రెండుసార్లు గెలిచిన శ్రీరాం రాజ్‌గోపాల్‌ తాతయ్య తాజాగా మూడోసారి విజయకేతనం ఎగరేశారు. 


నాలుగోసారి..

వనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్‌ జనసేన నుంచి టికెట్‌ సాధించి నాలుగోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్‌ నుంచి రెండుసార్లు, తెదేపా తరఫున ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. తెదేపా ప్రభుత్వ హయాంలో మండలి బుద్ధప్రసాద్‌ ఉపసభాపతిగా పనిచేశారు. 

విజయవాడ తూర్పు నుంచి తెదేపా తరఫున పోటీ చేసి గద్దె రామ్మోహన్‌ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ విజయం సాధించారు. గతంలో గన్నవరం నుంచి ఎమ్మెల్యే గానూ, విజయవాడ ఎంపీగానూ పనిచేశారు.


గద్దె రామ్మోహన్‌ విజయవాడ తూర్పు

- విజయవాడ సిటీ

 • మొగల్రాజపురం, క్రీస్తురాజపురం, గుణదల పరిధిలో కొండ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు నిరంతర నీటి సరఫరా.. వీరి కోసం రహదారులు, మెట్ల మార్గాల అభివృద్ధి.
 • వాన నీటి మళ్లింపు డ్రెయిన్లు పెంచడం ద్వారా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం.
 • కృష్ణలంకలో పేద, మధ్య తరగతి ప్రజలకు ఇళ్ల పట్టాలు
 • నియోజకవర్గంలో అర్హులకు 2 సెంట్లు స్థలం, టిడ్కో గృహాలు పూర్తి చేసి అప్పగింత
 • అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందించి భరోసాగా నిలుస్తాం. 

బొండా ఉమా విజయవాడ సెంట్రల్‌ 

 - మధురానగర్‌ 

 • సెంట్రల్‌ పరిధిలో రహదారుల నిర్మాణం చేపట్టి.. ట్రాఫిక్‌ సమస్యలు తీర్చేలా మెరుగైన రవాణా సౌకర్యాల ఏర్పాటు
 • అజిత్‌సింగ్‌నగర్‌ ఎక్సెల్‌ ప్లాంట్‌ వద్ద కృష్ణా నీరు తీసుకువచ్చి శుద్ధి చేసిన తాగునీరు ఇచ్చేలా 10 ఎంజీడీ ప్లాంట్‌ను రూ.70 కోట్లతో నిర్మిస్తాం.
 • వాంబేకాలనీ, గుణదల వద్ద రెండు ఆర్వోబీలు త్వరితగతిన నిర్మిస్తాం. మధురానగర్‌ వద్ద ఆర్‌యూబీని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తాం.
 • గతంలో తెదేపా హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను కొలిక్కి తెచ్చి పూర్తి స్థాయిలో అందజేస్తాం.
 • వైకాపా వారు పేదలకు సెంటు పట్టాలని అరచేతిలో వైకుంఠం చూపారు. చాలా మందికి ఇళ్లు ఇవ్వలేదు. దీనిపై సమీక్షించి వివరాలు వెలుగులోకి తెస్తాం.

తంగిరాల సౌమ్య  నందిగామ

- నందిగామ 

 • నందిగామ పురపాలికకు శాశ్వత మంచి నీటి పథకం పూర్తి. గ్రామీణ ప్రాంతాలకూ తాగునీటి సమస్య అధిగమించేలా కృషి.
 • నియోజకవర్గ పరిధిలో అన్ని ఎత్తిపోతల పథకాలు అందుబాటులోకి తెస్తాం. వేదాద్రి ఎత్తిపోతలకు నిధులు మంజూరు చేయించి అందుబాటులోకి తెస్తాం.
 • నందిగామ ప్రాంతాన్ని రాజధాని అమరావతితో అనుసంధానం చేసేలా కృష్ణా నదిపై చెవిటికల్లు - అమరావతి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి కృషి.
 • పారిశ్రామికవేత్తలతో పరిశ్రమల స్థాపన ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు. పెద్దవరం వద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తాం.
 • మహిళా సాధికారతకు.. మగువలకు స్వయం ఉపాధి పథకాలు అందించి ఆర్థిక వృద్ధి చెందేలా కృషి. 

సుజనాచౌదరి విజయవాడ పశ్చిమ

- విద్యాధరపురం

 • కొండ ప్రాంతంలో నివసించే వారికి.. ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషను చేయించేలా కృషి
 • లేబరు కాలనీలో స్టేడియం నిర్మాణం కొలిక్కి తేవడం ద్వారా క్రీడావికాసానికి అడుగులు
 • రాష్ట్రంలో అతి పెద్ద దేవాలయాల్లో రెండోదిగా పేరొందిన దుర్గగుడి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కృషి
 • భవానీ ద్వీపం అభివృద్ధికి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక.. పర్యాటక వెలుగులకు దోహదం
 • వక్ఫ్‌ ఆస్తుల సంరక్షణ, హజ్‌హౌస్‌ నిర్మాణం
 • నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు 

శ్రీరాం తాతయ్య జగ్గయ్యపేట

 - జగ్గయ్యపేట 

 • 65 వేల ఎకరాల సాగు విస్తీర్ణానికి పుష్కలంగా నీరివ్వడం.. ముక్త్యాల ఎత్తిపోతలతో ఎన్నెస్పీ ఆయకట్టు, పోలంపల్లి డ్యామ్‌ దారా మునేరు ఆయకట్టు, కాచవరం తదితర వనరులకు, ఎత్తిపోతల ద్వారా వీలున్న ప్రతి గ్రామానికి సాగునీరు చేరువ.
 • కృష్ణా జలాల పంపిణీ వ్యవస్థ మెరుగు.. అన్ని గ్రామాలకు రక్షిత నీరు.
 • గతంలో తెదేపా హయాంలో 80 శాతం పూర్తయిన 3,500 టిడ్కో ఇళ్లపూర్తి.. అన్నిగ్రామాల వారికి నివేశన స్థలాలు, పక్కా ఇళ్లు.
 • గురుకుల పాఠశాలల బలోపేతం..  ప్రభుత్వ కళాశాల ఏర్పాటు
 • ప్రభుత్వ వైద్యశాల, డయాలసిస్‌ కేంద్రాల పటిష్టం.. 100 పడకల ఆసుపత్రి, ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రాధాన్యం.

వసంత వెంకట కృష్ణప్రసాద్‌ మైలవరం

- మైలవరం

 • అన్నదాతకు సాగునీటి ఇబ్బందులను తొలగించే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చేయించటం నా తొలి ప్రాధాన్యం.
 • ఇబ్రహీంపట్నం, కొండపల్లిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం
 • నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న రహదారి అభివృద్ధి పనులు పూర్తి చేయిస్తా.
 • ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
 • 2014-19 మధ్య రూపాయి బిల్లుతో మంజూరైన గృహాలకు నిధుల కేటాయింపునకు కృషి. సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే వారికి మంజూరుకు ఇప్పటికే గృహ నిర్మాణ మంత్రి పార్థసారథితో మాట్లాడాను. 

కొలికపూడి శ్రీనివాసరావు  తిరువూరు

- తిరువూరు

 • రాజధాని అమరావతి అభివృద్ధిని తిరువూరు వరకు తెస్తూ.. పారిశ్రామిక కారిడార్‌ విస్తరణతో యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు
 • కిడ్నీ సమస్యలతో సతమతమవుతూ.. మరో ఉద్ధానంలా తయారైన ఎ.కొండూరు మండలంలోని తండాలకు స్వచ్ఛమైన కృష్ణా జలాలు అందిస్తాం. కిడ్నీ వ్యాధి పూర్తిగా నివారించేలా చర్యలు తీసుకుంటాం.
 • చింతలపూడి పథకం నిర్మాణం పూర్తి ద్వారా పుష్కలంగా సాగునీరు అందేలా కార్యాచరణ
 • మామిడి ఆధారిత ప్రాసెస్‌ యూనిట్లు ఏర్పాటుతో అన్నదాతకు అండ..
 • అసంపూర్తిగా ఉన్న తాగునీటి పథకాలను కొలిక్కి తెచ్చి ప్రతి పల్లెకు సుజలాలు అందిస్తాం. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని