logo

వివాహితపై అఘాయిత్యం!

బాపులపాడు మండలంలో ఓ గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం.

Published : 22 Jun 2024 05:10 IST

హనుమాన్‌జంక్షన్, న్యూస్‌టుడే: బాపులపాడు మండలంలో ఓ గ్రామానికి చెందిన వివాహితపై అత్యాచారం జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుపై వీరవల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. వివాహిత, భర్తతో కలహాల కారణంగా కొంతకాలం నుంచి పుట్టింట్లోనే ఉంటోంది. శుక్రవారం మధ్యాహ్నం ప్రియుడితో కలిసి పోలవరం గట్టు ప్రాంతానికి వెళ్లింది. ఈ సమయంలో వారిని అటకాయించిన ఓ ఆగంతకుడు, ప్రియుడి కళ్లలో కారం చల్లి, బలవంతంగా లాక్కెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సీసీఎస్‌ పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. దీనిపై ఎస్సై చిరంజీవిని ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా, ఘటనకు సంబంధించి ఫిర్యాదు వచ్చిన మాట వాస్తవమేనని, విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని