logo

రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌ చేస్తే చర్యలు

రేషన్‌ బియ్యం రీ సైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారిణి (డీఎస్‌వో) పార్వతి అన్నారు.

Published : 22 Jun 2024 05:11 IST

మాట్లాడుతున్న డీఎస్‌వో పార్వతి 

చల్లపల్లి, న్యూస్‌టుడే: రేషన్‌ బియ్యం రీ సైక్లింగ్‌ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారిణి (డీఎస్‌వో) పార్వతి అన్నారు. శుక్రవారం చల్లపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో రేషన్‌ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్‌వో మాట్లాడుతూ కార్డుదారుల వద్ద రేషన్‌ బియ్యం కొనుగోలు చేసినా, రేషన్‌ డీలర్లపై, ఎండీయూ ఆపరేటర్లపై ఎలాంటి ఫిర్యాదులు అందినా వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. తహసీల్దార్‌ బి.సుమతి, పీడీఎస్‌ డీటీ వెంకటేశ్వరరావు, ఇన్‌ఛార్జి ఆర్‌.ఐ. ఘంటసాల కృష్ణమోహన్, వీఆర్వోలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని