logo

అవనిగడ్డలో వైద్య ఆరోగ్య శాఖ బృందం తనిఖీలు

స్థానిక బందలాయిచెరువు ఆరోగ్య ఉప కేంద్రంలో నమోదైన గర్భిణులు, బాలింతలు, శిశు జననాల పైన, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ బృందం శుక్రవారం రికార్డులు తనిఖీ చేసింది.

Published : 22 Jun 2024 05:17 IST

 ఆరోగ్య ఉప కేంద్రంలో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు 

అవనిగడ్డ, న్యూస్‌టుడే: స్థానిక బందలాయిచెరువు ఆరోగ్య ఉప కేంద్రంలో నమోదైన గర్భిణులు, బాలింతలు, శిశు జననాల పైన, వారికి అందిస్తున్న వైద్య సేవల గురించి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ బృందం శుక్రవారం రికార్డులు తనిఖీ చేసింది. గర్భిణులకు ఇచ్చే ఎన్‌సీసీ కార్డులను, ఏఎన్‌ఎంల హోమ్‌ విజిట్లు సక్రమంగా కొనసాగుతున్నాయా లేదా తదితర అంశాలను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్‌ రాహుల్, డీపీహెచ్‌ఎన్‌వో దీవెన, డీఈవో అరుణ, ఎస్‌వో ఆనంద్, హెచ్‌వీ మేరీ, పీహెచ్‌ఎన్‌ ప్రమీల, ఎంపీహెచ్‌ఈవో రెడ్డియ్య, సీహెచ్‌వో మౌనిక, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని