logo

రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం

రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఒలింపిక్‌ రన్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Published : 24 Jun 2024 04:10 IST

ఉత్సాహంగా సాగిన ఒలింపిక్‌ రన్‌

జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే : రాష్ట్రంలో క్రీడలకు పూర్వ వైభవం వచ్చిందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ఒలింపిక్‌ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఒలింపిక్‌ రన్‌కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి రాష్ట్రం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రీడలను అమితంగా ప్రేమిస్తారని గుర్తు చేశారు. అమరావతిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి తనవంతు కృషి చేశారన్నారు. రానున్న రోజుల్లో విజయవాడ, అమరావతిలో మరిన్ని అంతర్జాతీయ స్టేడియాలు నిర్మించి క్రీడా నగరాలు, కాంప్లెక్స్‌లు నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో రాణించి రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటిన జెస్సీ రాజ్, తేజేష్‌లను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. అనంతరం క్రీడా జ్యోతి వెలిగించి జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు నాదెళ్ల బ్రహ్మాజీరావుకు అందించారు. జెండా ఊపి పరుగును ప్రారంభించారు. బిషప్‌ అజరయ్య బాలికోన్నత పాఠశాల విద్యార్థినుల డప్పు వాయిద్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. క్రీడాకారులు, క్రీడాభిమానులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంతర్జాతీయ స్కేటర్లు జెస్సీ రాజ్, తేజేష్‌లకు బ్రహ్మాజీరావు రూ.5 వేల చొప్పున చెక్కును ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి పి.పద్మజాబాల, ఉపాధ్యక్షులు ఇ.సులోచన, జె.రాజేంద్రప్రసాద్, కోశాధికారి వైవీఎస్‌ ఉమామహేశ్వరరావు, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్సాహంగా సాగిన ఈ రన్‌ స్థానిక ఐజీఎంసీ స్టేడియం నుంచి మహాత్మాగాంధీ రోడ్డు మీదుగా బెంజిసర్కిల్‌ వరకు సాగి తిరిగి ఐజీఎంసీ స్టేడియంలో ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని