logo

ఇలా ఉంటే రోగాలు రావా?

జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో డయేరియా విజృంభిస్తోంది. పలు గ్రామాల్లో నివాస గృహాల మధ్యనే మురుగు నిల్వ ఉంటోంది. అయినా అధికారులు సరిగా స్పందించడం లేదు.

Updated : 24 Jun 2024 05:39 IST

మద్దూరు దళితవాడను చుట్టిముట్టిన వర్షపు నీరు 

న్యూస్‌టుడే, కంకిపాడు:  జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో డయేరియా విజృంభిస్తోంది. పలు గ్రామాల్లో నివాస గృహాల మధ్యనే మురుగు నిల్వ ఉంటోంది. అయినా అధికారులు సరిగా స్పందించడం లేదు. కంకిపాడు మండలం గొడవర్రు ఆర్‌సీఎం పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, బాలికల వసతి గృహం, కుందేరు పాత ఎస్సీ కాలనీ, కుందేరు దళితవాడ, ఉప్పలూరు ఆర్‌సీఎం చర్చి, వేల్పూరు మలుపు, తెన్నేరు ఎస్సీ కాలనీ, వన్నేరుకు సమాంతరంగా విస్తరించిన ప్రాంతాలు, కోలవెన్ను దక్షిణంపైపు నంబిగుంట కాల్వ సరిహద్దు, కంకిపాడు బస్టాండ్, రైతు బజార్, లాకురోడ్డు, పులిరామారావు వీధి, మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట, మద్దూరు ప్రాంతాల్లో మురుగు సమస్య ఎక్కువగా ఉంది. డ్రెయిన్లు వ్యర్థాలతో పూడిపోగా, రహదారులపైకి వర్షపునీరు చేరుతోంది. మంచినీటి కుళాయిల వద్ద ప్లాట్‌ఫారాలు ధ్వంసం కాగా ఉపయోగించిన నీరు అక్కడే నిల్వ ఉంటోంది. అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సమస్య మరింత జఠిలంకాకముందే నివారణచర్యలు చేపట్టాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.             

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని