logo

జోగి కుటుంబం అగ్రిగోల్డ్‌ భూముల కబ్జాపై సీఐడీ విచారణ

వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యుల భూకబ్జాపై సీఐడీ కేంద్ర కార్యాలయం అధికారులు విచారణ చేపట్టారు. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో సీఐడీ అటాచ్‌ చేసిన అగ్రిగోల్డ్‌ భూములను జోగి రమేష్‌ కుమారుడు,

Published : 26 Jun 2024 04:04 IST

ఇతర ప్రాంతాల్లోని స్థలాలు పరిశీలిస్తున్న అధికారులు

ఈనాడు - అమరావతి: వైకాపా నేత మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యుల భూకబ్జాపై సీఐడీ కేంద్ర కార్యాలయం అధికారులు విచారణ చేపట్టారు. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురంలో సీఐడీ అటాచ్‌ చేసిన అగ్రిగోల్డ్‌ భూములను జోగి రమేష్‌ కుమారుడు, బాబాయి ఆక్రమించి, విక్రయించిన సంగతి ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీనిపై సీఐడీ స్పందించింది. మంగళగిరిలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి చెందిన అధికారులు అంబాపురం వచ్చి.. కబ్జాకు గురైన భూమిని పరిశీలించారు. దీనిపై రెవెన్యూ, విజయవాడ రెండో పట్టణ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈమేరకు ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. జోగి కుటుంబం కబ్జా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్రిగోల్డ్‌ ఆస్తుల తాజా పరిస్థితిపై సీఐడీ అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఎక్కడైనా ఆక్రమణలకు గురయ్యాయా? నిర్మాణాలు వెలిశాయా? అనే కోణంలో పరిశీలిస్తున్నారు. జోగి కుటుంబం కబ్జా వ్యవహారం విషయంలో కేసు నమోదుపై పోలీసు ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. కేసును సీఐడీ నమోదు చేయాలా? విజయవాడ పోలీసులు చేయాలా? అనేది ఒకటి, రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని