logo

‘టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై సీబీఐ విచారణ చేపట్టాలి’

గత అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో జరిగిన రూ.వేల కోట్ల టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని సమతా సైనిక్‌దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.

Published : 26 Jun 2024 04:05 IST

విజయవాడ(గాంధీనగర్‌), న్యూస్‌టుడే : గత అయిదేళ్ల వైకాపా ప్రభుత్వంలో జరిగిన రూ.వేల కోట్ల టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలని సమతా సైనిక్‌దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంలో అప్పటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. మంగళవారం ఆయన విజయవాడ లోటస్‌ల్యాండ్‌ మార్క్‌లోని సంస్థ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజల ఇంటి నిర్మాణాల కోసం.. కొన్ని ప్రాంతాల్లో కట్టడాల కోసం క్రమబద్ధీకరించేందుకు ఈ టీడీఆర్‌ బాండ్లు కొనుగోలు చేశారని పేర్కొన్నారు. మాజీ మంత్రి నాగేశ్వరరావుకు బినామీగా ఉన్న పులుపు అనిల్‌కుమార్‌ ఈ కుంభకోణంలో ప్రముఖ పాత్ర వహించారన్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై అనిశా అధికారులు తూతూమంత్రంగా విచారణ చేశారని విమర్శించారు. అనిల్‌కుమర్‌ తన పలుకబడితో విచారణను బుట్టదాఖలు చేయించారని ఆరోపించారు. ఈ కుంభకోణంలో రూ.వేల కోట్లు చేతులు మారాయని... సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై పూర్తి ఆధారాలతో త్వరలోనే డీజీపీకి ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సమతాసైనిక్‌ దళ్‌ నాయకులు సురేంద్రబాబు, శ్వేత పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు