logo

రాష్ట్ర ప్రగతికి కృషి చేయండి

ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనించేలా సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కోరారు.

Published : 26 Jun 2024 04:11 IST

మంత్రి కొలుసు పార్థసారథికి పుష్పగుచ్ఛాన్ని అందిస్తున్న శివారెడ్డి, పురుషోత్తం, విద్యాసాగర్‌ తదితరులు 

లబ్బీపేట(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే : ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనించేలా సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కోరారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కేవీ శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి మంగళవారం ఎంజీరోడ్డులోని కార్యాలయంలో  మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ అధికారులు, ఉద్యోగులు అత్యంత పారదర్శకంగా, వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రానున్న అయిదేళ్ల కాలంలో రాష్ట్రం దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు పొందాలంటే ఉద్యోగుల సహకారం ఎంతో అవసరం అన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా వారికి రావాల్సిన ప్రతి ప్రయోజనాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఉద్యోగి సంతోషంగా విధులు నిర్వహించేలా సంతృప్తికరస్థాయిలో ఆర్థిక, ఆర్థికేతర ప్రయోజనాలను ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేలా ప్రతి ఉద్యోగి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహమ్మద్‌ ఇక్బాల్, అసోసియేట్‌ అధ్యక్షుడు పి.రమేష్, కోశాధికారి వి.సతీష్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, సంయుక్త కార్యదర్శులు దిలీప్, శివలీల, నగరశాఖ అధ్యక్షుడు సీవీఆర్‌ ప్రసాద్, కార్యదర్శి షేక్‌ నజీరుద్దీన్, అసోసియేట్‌ అధ్యక్షుడు పి.రాజశేఖర్, ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వేమూరి ప్రసాద్, ఉపాధ్యక్షుడు పి.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని