logo

సెంటు పట్టా పేరుతో భారీ అవినీతి : దేవినేని

రాష్ట్రంలో సెంటు పట్టా పేరుతో వేల కోట్ల రూపాయల సొమ్మును వైకాపా నాయకులు దోచేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్స్‌ వేదికగా బుధవారం స్పందించారు.

Published : 11 Jul 2024 03:22 IST

గొల్లపూడి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో సెంటు పట్టా పేరుతో వేల కోట్ల రూపాయల సొమ్మును వైకాపా నాయకులు దోచేశారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎక్స్‌ వేదికగా బుధవారం స్పందించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కనుసన్నల్లో వైకాపా నేతలు భారీ అవినీతి దందాకు తెరలేపారని దుయ్యబట్టారు. జిల్లాలో రూ.300కోట్ల మేర కుంభకోణం జరిగిందన్నారు. పేదల స్థలాల కోసం భూసేకరణలో ఇష్టానుసారం రేట్లు పెంచి వైకాపా నాయకులు పంచుకున్నారన్నారు. అధికారులు, రైతులను మభ్యపెట్టి దోపిడీ చేశారన్నారు. భూసేకరణ, మెరకల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి బాధ్యులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుని సొమ్ము రికవరీ చేస్తామన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని