logo

బూదవాడ ఘటనలో ఆగిన మరో ఊపిరి

బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడు ప్రాణాలొదిలారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది.

Published : 11 Jul 2024 03:57 IST

రెండుకు చేరిన మృతుల సంఖ్య 

తాడేపల్లి, జగ్గయ్యపేట, న్యూస్‌టుడే: బూదవాడలోని అల్ట్రాటెక్‌ సిమెంటు కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడు ప్రాణాలొదిలారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మణిపాల్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాణావతు స్వామి(28) బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అదే పరిశ్రమలో పని చేసే ఆవుల వెంకటేష్‌ ఈనెల 7వ తేదీన కన్నుమూశారు. తొలుత గాయపడిన 16 మంది కార్మికుల్లో ఎనిమిది మందిని తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రిలో చేర్చారు. వారిలో ఇద్దరు మృతి చెందగా మరో కార్మికుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మిగిలిన ఐదుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన క్షతగాత్రులు గొల్లపూడిలోని ఆంధ్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.   

ఆర్డీవో రవీంద్రరావు, ఎమ్మెల్యే శ్రీరాంతాతయ్య, ఎస్టీ కమిషన్‌ సభ్యుడు చంద్రశేఖర్‌నాయక్‌ తదితరులు బాధిత కుటుంబానికి సంతాపం తెలిపి కర్మాగారం మృతులకు ప్రకటించిన రూ.50 లక్షల నష్టపరిహారాన్ని స్వామి కుమారులకు చెక్కుల రూపంలో అందించారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని