logo

తెదేపా నాయకులకు సత్కారం

తెదేపా కూటమి విజయం అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుతో సాధ్యమైందని అవనిగడ్డ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు.

Published : 15 Jun 2024 12:53 IST

మోపిదేవి: తెదేపా కూటమి విజయం అన్ని వర్గాల ప్రజల సంపూర్ణ మద్దతుతో సాధ్యమైందని అవనిగడ్డ నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. రాష్ట్రంలో తెదేపా, భాజపా, జనసేన కూటమి అధికారంలోకి రావటంతో బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పులిపర్రు గ్రామం నుంచి మోపిదేవి పుణ్యక్షేత్రానికి పాదయాత్రగా వచ్చిన 100 మంది తెదేపా కార్యకర్తలకు మండలి వెంకట్రామ్ ఘనంగా స్వాగతం పలికి వారిని  సత్కరించారు. పాదయాత్రగా మోపిదేవి వస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ప్రశంసించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు