logo
Published : 02 Dec 2021 05:03 IST

‘నిధుల మళ్లింపుపై కేసులు వేస్తాం’

ఉయ్యూరు గ్రామీణం, న్యూస్‌టుడే: పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన సుమారు రూ.3 వేలు కోట్లు నిధులను మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వంపై దిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని, దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. పంచాయతీల నిధుల మళ్లింపుపై ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కృష్ణా జిల్లా ఉయ్యూరు మండల పరిషత్‌ కార్యాలయం వద్ద ఉయ్యూరు, పమిడిముక్కల మండలాల సర్పంచులతో కలిసి నిరసన తెలిపారు. వైవీబీ మాట్లాడుతూ తాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం 14, 15 ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన నిధులు తరలించుకుపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసం వల్ల గ్రామ పంచాయతీలు నిర్వీర్యమైపోయాయిని, సర్పంచులు ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు నాలుగు నెలల క్రితం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.344 కోట్ల విద్యుత్తు బకాయిల కింద జమ వేసుకున్నామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసన మండలి సాక్షిగా ప్రకటించడం బాధ్యతా రాహిత్యం కాదా? అని ప్రశ్నించారు. మళ్ల్లించిన నిధులను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. చిన ఓగిరాల, జబర్లపూడి, సాయిపురం, మర్రివాడ, గోపువానిపాలెం సర్పంచులు యెనిగళ్ల శిరీషా, సూరపనేని శేషవరప్రసాద్‌, బాషా, ఫ్రాన్సిస్‌(పండు), భూషయ్య, తెదేపా నేతలు కుటుంబరావు, వీర శ్రీనివాస్‌, ఫణి, తేజ తదితరులు పాల్గొన్నారు. ఆందోళన అనంతరం ఎంపీడీవో సునీతా శర్మకు వినతి పత్రం అందజేశారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని