logo
Published : 02/12/2021 05:03 IST

‘పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయాలి’

ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. చిత్రంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ప్రభుత్వం పేదల ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లకు రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ధర్నాచౌక్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో పేదలకు శాశ్వత గృహ హక్కు అంటూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అండ్‌ కో భారీ స్థాయిలో వసూళ్లకు సిద్ధమయ్యారని ఆరోపించారు. పన్నులు, అదనపు ఛార్జీల పేరుతో ప్రజల నుంచి దోచుకుంటున్నది చాలక, ఇప్పుడు వారి ఇళ్ల పైనా కన్నేరాని మండిపడ్డారు. ప్రజల ఇళ్లల్లోని దస్తులు, బంగారం కూడా వదిలిపెట్టేలా లేరంటూ విమర్శించారు. ఎన్నికలకు ముందు అమలు కాని హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక నవ రత్నాలంటూ మాటమార్చారని పేర్కొన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిందని, ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు, టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు, కార్పొరేటర్‌ చెన్నగిరి రామ్మోహన్‌, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని