logo
Published : 02/12/2021 05:03 IST

బెజవాడ కొత్త సీపీగా కాంతి రాణా

 

ఈనాడు - అమరావతి: విజయవాడ కొత్త పోలీసు కమిషనర్‌గా కాంతి రాణా టాటా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీనివాసులు పదవీవిరమణ తర్వాత.. పూర్తి అదనపు బాధ్యతలతో పాలరాజును నియమించారు. కొన్నాళ్లు ఆయనే కొనసాగుతారని భావించినా, హఠాత్తుగా రెగ్యులర్‌ సీపీగా కాంతి రాణాను నియమించారు. వచ్చే నెలలో ఐజీగా పదోన్నతి రానుంది. కమిషనర్‌ పోస్టు ఐజీ స్థాయి కావడంతో ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం ఆయన అనంతపురం రేంజి డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. 2004 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన కాంతి రాణా.. నర్సీపట్నం అదనపు ఎస్పీగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. తర్వాత.. వరంగల్‌, ఖమ్మం ఓఎస్డీలుగా పనిచేశారు. ఎస్పీగా ఖమ్మం, చిత్తూరు జిల్లాలో విధులు నిర్వర్తించారు. అనంతరం మాదాపూర్‌ డీసీపీగా పనిచేశారు. అఖిల భారత స్థాయి అధికారుల క్యాడర్‌ విభజనలో ఏపీకి వచ్చారు. సీఐడీలో ఎస్పీగా వచ్చారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని