logo
Published : 02/12/2021 05:03 IST

సహకార ఉద్యోగుల వేతన సవరణ


వేతన సవరణ ఒప్పంద పత్రాన్ని ఉద్యోగ సంఘ సభ్యులకు అందజేస్తున్న ఝాన్సీరాణి

కృష్ణలంక, న్యూస్‌టుడే: 13జిల్లాల సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల 8వ వేతన సవరణ కార్యక్రమాన్ని విజయవాడలోని ఆప్కాబ్‌ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించారు. ఆప్కాబ్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జ్‌ మల్లెల ఝాన్సీరాణి అధ్యక్షతన సమావేశమయ్యారు. 2017 నవంబరు 1 నుంచి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను 23.45 శాతం వృద్ధితో అప్కాబ్‌, ఆంధ్రప్రదేశ్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంకు ఉద్యోగుల సంఘం, ఆంధ్రప్రదేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు ఉద్యోగ సంఘాల మధ్య సవరణ ఒప్పందం చేసుకున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులకు జాతీయ బ్యాంకుల మాదిరిగా వేతనాల అమలును చేపట్టారు. ఆప్కాబ్‌ మేనేజింగ్‌ డైరక్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి, విశ్రాంత మేనేజింగ్‌ డైరక్టర్‌ వి.గిరిధర్‌, 13 జిల్లాల సహాకార కేంద్ర బ్యాంకుల ఛైర్‌పర్సన్‌లు, ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఉద్యోగుల సంఘం జాతీయ కార్యదర్శి బీఎస్‌ రాంబాబు, ఫైబర్‌ గ్రిడ్‌ ఛైర్మన్‌ పి.గౌతంరెడ్డి, వై.ప్రతాప్‌రెడ్డి, తోట రామారావు సహకార బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని