logo
Published : 02/12/2021 08:01 IST

ఉద్యోగాల పేరిట వ్యభిచార కూపంలోకి!

నెహ్రూనగర్‌, న్యూస్‌టుడే: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువతులకు ఆశ చూపి సామాజిక మాధ్యమాల ద్వారా హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను బుధవారం నగరంపాలెం పోలీసులు పట్టుకున్నారు. మూడు రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. నగరంపాలెం సీఐ హైమారావుతో కలిసి నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో పశ్చిమ డీఎస్పీ సుప్రజ విలేకరులకు కేసు వివరాలు తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ చూపి హైదరాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలకు కోల్‌కత నుంచి యువతులను తీసుకొస్తున్నారు. వారి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు పరిష్కారామవుతాయని చెప్పి వ్యభిచారం చేయిస్తున్నారు. వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా నిర్వాహకులు యువతుల ఫొటోలు, వీడియోలు పంపి విటులను ఆకట్టుకుంటున్నారు. బేరం కుదుర్చుకున్న మొత్తాన్ని ఆన్‌లైన్‌లో జమ చేయించుకుంటున్నారు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇంటిని ఖాళీ చేసి మరో చోటకు మకాం మార్చుతున్నారు. స్థానికుల ద్వారా అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌కు సమాచారం తెలియడంతో పశ్చిమ డీఎస్పీ సుప్రజను అప్రమత్తం చేశారు. సీఐ హైమారావు, ఎస్సై రవితేజ, సిబ్బందితో కలిసి ఏటీ అగ్రహారం, అడవితక్కెళ్లపాడులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు మహిళా నిర్వాహకులు, ఇద్దరు విటులను అరెస్టు చేశారు. కోల్‌కతకు చెందిన యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని