logo
Published : 02/12/2021 05:42 IST

విలువలే విద్యకు శోభ


నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న నీతీ అయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాజీవ్‌ కుమార్‌

ఈనాడు-అమరావతి: అత్యుత్తమ గురువులను తయారుచేసే శిక్షణ సంస్థలను అభివృద్ధి చేయాలని నీతిఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ పేర్కొన్నారు. తాను చదువుకున్న రోజుల్లో నైతిక విలువలతో కూడిన పాఠ్యాంశాలు ఉండేవని, వాటిని తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నీతిఆయోగ్‌ ప్రాంతీయ విశ్వవిద్యాలయాలతో అనుసంధానమై చర్చించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. గుంటూరులోని ఆచార్యనాగార్జున విశ్వవిద్యాలయంలో బుధవారం సాయంత్రం విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నత విద్యామండలి అధికారులు, విశ్వవిద్యాలయాల పాలకవర్గ సభ్యులు, విద్యావేత్తలు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులతో నీతిఆయోగ్‌ బృందం సమావేశమైంది. ఈసందర్భంగా రాజీవ్‌కుమార్‌ మాట్లాడుతూ డిజిటల్‌ విద్యను ప్రోత్సహించాలని సూచించారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అన్ని పంటలలో సగటు ఉత్పాదకతలో ముందంజలో ఉందన్నారు. ఆర్జీయూకేటీ ఛాన్సలర్‌ కేసీ రెడ్డి మాట్లాడుతూ పేదల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వారి విద్య, ఆరోగ్యం కోసం పెడుతున్న పెట్టుబడిగా చూడాలన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య హేమచంద్రారెడ్డి రాష్ట్రంలో ఉన్నతవిద్య అభివృద్ధికి తీసుకున్న చర్యలను వివరించారు. ఏపీ మద్యవిమోచన ప్రచార కమిటీ ఛైర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యనిషేధం అమలు దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. వాసవీమహిళా మండలి డాక్టర్‌ కీర్తి మాట్లాడుతూ మద్యం తాగే వ్యక్తి వల్ల కుటుంబాలు దెబ్బతింటున్న వైనాన్ని వివరించి కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆచార్య రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని