logo
Published : 02/12/2021 06:05 IST

ప్రాచీన ఆలయాల చరిత్రను ప్రచారం చేయాలి


పూజల్లో పాల్గొన్న స్వాత్మానందేంద్ర సరస్వతి, మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే రోశయ్య, ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి తదితరులు

పెదకాకాని, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాల చరిత్రను చాటుతూ ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిస్వామి అన్నారు. స్థానిక మల్లేశ్వరస్వామిని బుధవారం ఆయన దర్శించుకున్నారు. ఆయనకు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే రోశయ్య, ఎమ్మెల్సీ టి.కల్పలతరెడ్డి, అర్చకులు, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన మల్లేశ్వరస్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం నిర్వహించి, ప్రత్యేక హోమ పూజలు జరిపారు. కార్యక్రమంలో దేవదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.వాణిమోహన్‌, జిల్లా డిప్యూటీ కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సహాయ కమిషనర్‌ శ్యామల రఘునాథరెడ్డి, ఛైర్మన్‌ బొంతు శివారెడ్డి పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని