logo
Published : 02/12/2021 06:13 IST

ఆస్తి పన్ను పెంపు చట్ట విరుద్ధం


మాట్లాడుతున్న రాజారామ్‌

జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: పట్టణ ప్రాంతాల్లో నివాస భవనాలు, స్థలాలపై పన్ను మదింపు విధానానికి స్వస్తి పలికి ఏపీ మున్సిపల్‌ చట్టం-2020 తీసుకురావడం చట్ట విరుద్ధమని ఆంధ్ర న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.వి.రాజారామ్‌ అన్నారు. గుంటూరు నగరం అరండల్‌పేటలోని ఓ హోటల్‌లో అవగాహన సంస్థ, ఆంధ్ర న్యాయవాదుల సంఘం సంయుక్తంగా బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల అనుమతి ముందుగా తీసుకోకుండా, అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండానే చట్టం చేశారని విమర్శించారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసి న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆస్తి పన్ను ఏడాదికి 15 శాతం పెరిగినా ఏటా పెరిగే పన్నుతో 200-300 శాతం వరకు ఇంటి పన్నులు భవిష్యత్తులో పెరుగుతాయన్నారు. నూతన గృహాలకు 15 శాతం పెంపుదల వర్తించదన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టే విధంగా నూతన మున్సిపల్‌ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రమే ఒత్తిడి తీసుకొచ్చిందని విమర్శించారు. సమావేశంలో ఆంధ్ర న్యాయవాదుల సంఘం కార్యదర్శి మేడా శ్రీనివాస్‌, పట్టణ గృహ యజమానుల సంఘం కార్యదర్శి పీఎస్‌ మూర్తి, ఎస్‌హెచ్‌వో అధ్యక్షుడు డాక్టర్‌ టి.సేవకుమార్‌, న్యాయవాది నడింపల్లి గురుదత్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని