AP News: 11 మంది వైకాపా అభ్యర్థులు ఎమ్మెల్సీలుగా ఎన్నిక: రాష్ట్ర ఎన్నికల సంఘం

స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైకాపాకు చెందిన అభ్యర్థులు శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ అధికారిక నోటిఫికేషన్‌

Published : 03 Dec 2021 01:22 IST

అమరావతి: స్థానిక సంస్థల కోటాలో 11 మంది వైకాపాకు చెందిన అభ్యర్థులు శాసనమండలి సభ్యులుగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ అధికారిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. మొత్తం 8 జిల్లాల్లోని స్థానిక సంస్థల నుంచి వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది. అనంతపురం నుంచి యల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, కృష్ణా జిల్లా నుంచి తలశిల రఘురామ్‌, మొండితోక అరుణ్‌ కుమార్‌లు ఎన్నికైనట్టు తెలిపింది. తూర్పుగోదావరి నుంచి అనంత సత్య ఉదయభాస్కర్‌, గుంటూరు నుంచి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నోటిఫికేషన్‌లో ప్రకటించింది. విజయనగరం నుంచి ఇందుకూరి రఘురాజు, విశాఖ నుంచి వరుదు కల్యాణి, చెన్నుబోయిన శ్రీనివాసరావు, చిత్తూరు నుంచి కృష్ణరాఘవ జయేంద్ర భరత్‌, ప్రకాశం నుంచి తూమాటి మాధవరావు ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్టు నోటిఫికేషన్ ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని