logo
Published : 04/12/2021 02:44 IST

‘దివ్యాంగ పిల్లల ప్రతిభను వెలికితీయాలి’

మాట్లాడుతున్న హోంమంత్రి సుచరిత. వేదికపై ఎమ్మెల్యే రోశయ్య, విద్యాశాఖ ఉన్నతాధికారులు రాజశేఖర్‌, సురేష్‌ తదితరులు

దివ్యాంగ చిన్నారుల్లోని ప్రతిభను గుర్తించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. వెనిగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో ‘అంతర్జాతీయ దివ్యాంగుల వేడుకలు’ ఏర్పాటయ్యాయి. ఎమ్మెల్యే కిలారి రోశయ్య అధ్యక్షత వహించగా, హోంమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల నుంచి వచ్చిన దివ్యాంగ విద్యార్థులు ఆటపాటలు, నృత్య ప్రదర్శనలతో అలరించారు. చిన్న వయసులోనే పిల్లల్లోని లోపాలను గుర్తించి, చికిత్స అందిస్తే వారు సంపూర్ణ ఆరోగ్య వంతులుగా మారతారన్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, ఆ శాఖ కమిషనర్‌ సురేష్‌, తదితరులు మాట్లాడారు.

దివ్యాంగ విద్యార్థుల నృత్య ప్రదర్శన

- న్యూస్‌టుడే, పెదకాకాని

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని