logo
Published : 04/12/2021 02:44 IST

రాజధాని సామగ్రి తరలిపోతోందా?

తహసీల్దారు కార్యాలయం ఎదుట పైపుల లోడుతో.. ఒడిశా నంబరు ప్లేటుతో ఉన్న టిప్పరు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: అమరావతి బృహత్‌ ప్రణాళికలో భాగంగా గత ప్రభుత్వం రాజధానిలో భూగర్భ డ్రైనేజీ, విద్యుత్తు, కమ్యూనికేషన్‌ వ్యవస్థ ఏర్పాటు పనులు ప్రారంభించింది. ఇందుకు అవసరమైన పైపులు, కేబుళ్లను ఆ పనులు దక్కించుకున్న వివిధ గుత్తేదారు సంస్థలు రాజధాని భూముల్లో డంప్‌ చేశాయి. ప్రస్తుతం రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్ల అభివృద్ధి, తదితర పనులు నిలిచిపోయాయి. డంప్‌ చేసిన సామగ్రి రాజధాని అమరావతిలోని వివిధ ప్రాంతాల్లో ఉంది. ఈ నేపథ్యంలో బయట నలుపు, లోపలి వైపు పసుపు రంగు కలిగిన పైపులను లోడు చేసుకొని ఒడిశా నంబరు ప్లేటుతో ఉన్న టిప్పరు శుక్రవారం తుళ్లూరులోని తహసీల్దారు కార్యాలయం ముందు కనిపించింది. దీనిపై న్యూస్‌టుడే పోలీసులను వివరణ కోరగా, ఆ వాహనాన్ని జిల్లా ఆర్టీఓ అధికారులు తనిఖీ చేశారని, దాన్ని తెచ్చిన వారు రోడ్డు పన్నులు చెల్లించారని చెప్పారు. ప్రస్తుతం ఆ టిప్పరు, సామగ్రిని తరలించనున్నట్లు సమాచారం. కాగా టిప్పరులోని సామాగ్రి ఏ గుత్తేదారు సంస్థది? దాన్ని రాజధాని ప్రాంతం నుంచి ఎక్కడికి తీసుకెళుతున్నారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా టిప్పరులో పైపులను చూసిన రైతులు రాజధాని సామాగ్రి తరలిపోతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని