logo
Updated : 04/12/2021 09:08 IST

AP News: రూ. కోట్ల ఖర్చుతో పూర్తైంది... లక్షల ఖర్చులో ఆగింది...  

కానూరు వి.ఆర్‌ సిద్దార్థ కళాశాల ప్రాంగణంలోంచి నిర్మించిన పైవంతెన

విజయవాడ బందరు రోడ్డు విపరీతమైన ట్రాఫిక్‌తో నిత్యం రద్దీగా..తరచూ ట్రాఫిక్‌ జాంలతో గంటల తరబడి వాహనచోదకులు ఇబ్బంది పడుతుంటారు. ఈ రోడ్డుపై ఒత్తిడి తగ్గించేందుకు గత ప్రభుత్వ హయాంలో పటమట ఎన్టీఆర్‌ సర్కిల్‌ నుంచి నేరుగా తాడిగడప 100అడుగుల రోడ్డుకు కలిసేందుకు వీలుగా పంటకాలువ రోడ్డును ప్రభుత్వం అభివృద్ధి చేసింది. దీనివల్ల అటు ఏలూరు, ఇటు మచిలీపట్నం వైపు వెళ్లే వాహనాలకు ఉపయోగకరం. దీనికోసం కానూరు వి.ఆర్‌. సిద్దార్థ కళాశాల యాజమాన్యం తన సొంత స్థలంలో, దాదాపు రూ.12కోట్ల సొంతంగా ఖర్చు చేసి పైవంతెన నిర్మాణం పూర్తి చేసింది.సైడు కాలువలు, అప్రోచురోడ్డు నిర్మిస్తే బందర్‌రోడ్డుకు ప్రత్యామ్నాయమార్గంగా మారే ఈ రహదారిని కోట్ల ఖర్చుతో నిర్మించి, లక్షల్లో ఖర్చు చేయలేక దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఇలా వృథాగా వదిలేశారు. ఇప్పటికైనా ఈరహదారిని వినియోగంలోకి తీసుకురావాలని వాహనచోదకులు కోరుతున్నారు.

రెండువైపులా ఇలా తవ్వి వాహనాలు వెళ్లకుండా వదిలేశారు

- ఈనాడు, అమరావతి

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని