logo
Published : 08/12/2021 05:13 IST

అంగన్‌వాడీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఐసీడీఎస్‌ పీడీ కె.ఉమారాణి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, చిల్లకల్లు, గన్నవరం, గుడివాడ, కైకలూరు, కంచికచర్ల, కంకిపాడు, మండవల్లి, మొవ్వ, మైలవరం, నందిగామ, నూజివీడు, పామర్రు, తిరువూరు, విజయవాడ-1, 2, విస్సన్నపేట, ఉయ్యూరు ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలు ఉన్నట్టు పేర్కొన్నారు. 23 కార్యకర్తల ఉద్యోగాల ఖాళీలు ఉండగా, వీటిలో ఎస్సీలకు 7, బీసీలకు 4, ఓసీలకు 12 ఉన్నట్టు వివరించారు. ఆయాలు 216 ఖాళీగా ఉండగా, వీటిలో ఎస్సీలకు 70, బీసీలకు 77, ఓసీలకు 63 ఉన్నట్టు తెలిపారు. అర్హులైన వారు ఈనెల 20వ తేదీలోగా దరఖాస్తు చేయాలని సూచించారు. కార్యకర్త ఉద్యోగాలకు 21 నుంచి 35 ఏళ్ల వయసు, పదో తరగతి విద్యార్హత కలిగి, ఆ ఊరి కోడలై ఉండాలన్నారు. వివరాలకు సంబంధిత ఐసీడీఎస్‌ కార్యాయాల్లో సంప్రదించాలని ఆమె సూచించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని