logo

పోలీస్‌ కమిషనర్‌ నేడు బాధ్యతలు స్వీకరణ

విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా కాంతిరాణా టాటా బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు పనిచేసిన బి.శ్రీనివాసులు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కాంతిరాణా టాటాను ప్రభుత్వం నియమించింది.

Published : 08 Dec 2021 05:13 IST


కాంతి రాణా టాటా

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : విజయవాడ పోలీస్‌ కమిషనర్‌గా కాంతిరాణా టాటా బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకు పనిచేసిన బి.శ్రీనివాసులు ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కాంతిరాణా టాటాను ప్రభుత్వం నియమించింది. 2004 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన ఆయన.. గతంలో విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌లో ట్రాఫిక్‌ డీసీపీగా పని చేశారు. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు వినూత్న ప్రణాళికలు చేపట్టారు. విజయవాడ జాయింట్‌ సీపీగానూ విధులు నిర్వహించారు. ప్రస్తుతం అనంతపురం రేంజ్‌ డీఐజీగా పనిచేస్తున్న కాంతిరాణా టాటాను విజయవాడ సీపీగా బదిలీ చేస్తూ ఈ నెల 1న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఆయన కమిషనర్‌ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని