logo

రైలు డ్రైవర్లకు కరోనా

విజయవాడ డివిజన్‌ పరిధిలోని రైలు డ్రైవర్లకు కరోనా సోకడంతో మంగళవారం నుంచి పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 50 మంది వరకు ఎక్స్‌ప్రెస్‌, పాసింజరు, గూడ్స్‌, షంటర్ల డ్రైవర్లు

Published : 18 Jan 2022 03:35 IST

నేటి నుంచి పలు రైళ్ల రద్దు

రైల్వేస్టేషన్‌(విజయవాడ), న్యూస్‌టుడే: విజయవాడ డివిజన్‌ పరిధిలోని రైలు డ్రైవర్లకు కరోనా సోకడంతో మంగళవారం నుంచి పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సుమారు 50 మంది వరకు ఎక్స్‌ప్రెస్‌, పాసింజరు, గూడ్స్‌, షంటర్ల డ్రైవర్లు కరోనా బారిన పడ్డారు. వారందరూ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

రద్దయిన రైళ్ల నంబర్లు, వివరాలు (18వ తేదీ నుంచి 22వరకు)

07869 మచిలీపట్నం-గుడివాడ.
07880 గుడివాడ-మచిలీపట్నం
07245 మచిలీపట్నం-గుడివాడ
07871 గుడివాడ-మచిలీపట్నం
07897 నర్సాపురం-నిడదవోలు
07771 నిడదవోలు-నర్సాపూర్‌
17270 నర్సాపూర్‌-విజయవాడ
17269 విజయవాడ-నర్సాపూర్‌
17237-17238 బిట్రగుంట-చెన్నై-బిట్రగుంట(18 నుంచి 21వరకు)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని