logo

తిరుపతమ్మ రంగుల ఉత్సవంలో మార్పులు

ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్న పెనుగంచిప్రోలు తిరుపతమ్మ రంగుల ఉత్సవంలో స్పల్ప మార్పులు చేస్తున్నట్లు ఈవో కె. శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో రాత్రి 11 గంటల

Published : 18 Jan 2022 03:35 IST

పెనుగంచిప్రోలు, న్యూస్‌టుడే: ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్న పెనుగంచిప్రోలు తిరుపతమ్మ రంగుల ఉత్సవంలో స్పల్ప మార్పులు చేస్తున్నట్లు ఈవో కె. శోభారాణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ విధించినందున దేవతామూర్తుల విగ్రహాలను జగ్గయ్యపేట తీసుకెళ్లే సమయాల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. సోమవారం తహసీల్దారు నాగభూషణం అధ్యక్షతన ఆలయ ఛైర్మన్‌ యింజం చెన్నకేశవరావు, అధికారులతో సమావేశం నిర్వహించారు. 20న ఆలయంలోని విగ్రహాలను తెల్లవారుజామున 6 గంటలకు బయటకు తీస్తారు. 11.30 గంటలకు గ్రామంలోని రంగుల మండపం వద్దకు తీసుకువస్తారు. మధ్యాహ్నం 1.30 గంటలకు ఎడ్ల బళ్లు ఎక్కించి జగ్గయ్యపేట బయలుదేరుతారు. రాత్రి 9.30 గంటలకు జగ్గయ్యపేట రంగుల మండపానికి చేరుకునేలా సమయ ప్రణాళిక తయారు చేశారు. ఈ విషయమై ఎడ్ల బళ్ల యజమానులతో కూడా అధికారులు చర్చించారు. ఈఈ వైకుంఠరావు, పర్యవేక్షకులు ఉమాపతి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని