logo

ప్రయోగాత్మక భూ రీసర్వే మొదటి దశ పూర్తి

వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా మంగళవారం ప్రారంభించారు. నగరంలోని కలెక్టర్‌ విడిది

Published : 19 Jan 2022 03:31 IST

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ (వీసీ) ద్వారా మంగళవారం ప్రారంభించారు. నగరంలోని కలెక్టర్‌ విడిది కార్యాలయంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. జిల్లాలో జగ్గయ్యపేట మండలం షేర్‌ మహ్మద్‌పేట, మచిలీపట్నం మండలం పొట్లపాలెం, గుడివాడ మండలం మెరకగూడెం, నూజివీడు మండలం మర్రిబంధం గ్రామాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే మొదటి దశ (ట్రైన్‌ వన్‌) పూర్తయినట్టు తెలిపారు. రెండో దశలో 29 గ్రామాల్లో చేపట్టగా, వివిధ దశల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. కలెక్టర్‌ జె.నివాస్‌ మాట్లాడుతూ.. రీ సర్వేతో... సర్వే నంబర్లు పెరిగినట్టు తెలిపారు. కమతాలు చేసుకున్న వారీగా విభజించడంతో సంఖ్య పెరిగినట్టు పేర్కొన్నారు. మూడోదశ (ట్రైన్‌ త్రీ)లో 191 గ్రామాల్లోనూ.. నాలుగో దశ (ట్రైన్‌ ఫోర్‌)లో నాలుగు గ్రామాల్లో ప్రీ డ్రోన్‌ యాక్టివిటీస్‌ పూర్తయినట్టు తెలిపారు. మూడో దశలో 117 గ్రామాలు, నాలుగో దశలో 23 గ్రామాల్లో గ్రౌండ్‌ కంట్రోల్‌ పాయింట్లు పూర్తి చేసినట్టు వివరించారు. వీసీలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్‌ భాగ్యలక్ష్మి, జేసీ కె.మాధవీలత, సబ్‌కలెక్టర్‌ జీఎస్‌ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, సర్వే విభాగ ఏడీ కె.సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని