logo

‘ చింతామణిపై నిషేధం..రంగస్థలానికి అన్యాయం’

వందేళ్ల చరిత్ర కలిగిన సందేశాత్మక నాటకం చింతామణిని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేయడం అన్యాయమని, రంగస్థలానికి, కళాకారులకు తీరని లోటని ప్రముఖ

Published : 19 Jan 2022 03:31 IST

అవనిగడ్డ, న్యూస్‌టుడే: వందేళ్ల చరిత్ర కలిగిన సందేశాత్మక నాటకం చింతామణిని నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేయడం అన్యాయమని, రంగస్థలానికి, కళాకారులకు తీరని లోటని ప్రముఖ రంగస్థల నటుడు, చింతామణి నాటకంలో బిళ్వమంగళుడు పాత్రదారి పుప్పాల వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని సినిమాగా చిత్రీకరించి ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎస్వీ.రంగారావు, ఎన్టీ.రామారావు, కె.రఘురామయ్య నటించారని గుర్తు చేశారు. చెడు అలవాట్లకు బానిసై కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దనే సందేశాత్మక నాటకాన్ని నిలిపివేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన రద్దు జీవోలు ఉపసంహరించాలని వీరాంజనేయులు, తదితర కళాకారులు ప్రభుత్వాన్ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని