logo

కౌలు రైతు బలవన్మరణం

ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన  పెదకూరపాడు మండలం కన్నెగండ్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పాటూరి

Published : 19 Jan 2022 03:31 IST

కన్నెగండ్ల(పెదకూరపాడు), న్యూస్‌టుడే: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన  పెదకూరపాడు మండలం కన్నెగండ్ల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు పాటూరి వెంకటేశ్వరరావు (48) 30 సంవత్సరాల క్రితం గుంటూరు నుంచి అత్తగారి గ్రామమైన కన్నెగండ్ల బీసీ కాలనీకి వచ్చారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ ఏడాది మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగు చేస్తే తెగుళ్లతో పంట పూర్తిగా పోగా రూ.మూడు లక్షలు అప్పు మిగిలింది. కొంతకాలంగా సాగు కలిసి రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. కుటుంబంలో మనస్పర్థలు చోటుచేసుకోవడంతో మద్యానికి బానిసయ్యారు. ఈ నెల 15న రాత్రి ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. భార్య తిరుపతమ్మ, కుమారుడు ఏసుబాబు బంధువుల ఇళ్లలో, సమీప గ్రామాల్లో వెతికినా ఆచూకీ తెలియలేదు. మంగళవారం కనెగండ్ల గ్రామం నుంచి పణిదం వెళ్లే రహదారిలో రైతు షేక్‌ బుడా సాహెబ్‌ నేలబావిలో మృతదేహం లభ్యమైంది. అందరితో కలివిడిగా ఉండే వెంకటేశ్వరరావు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని