logo

నాణేలే చరిత్రకు ఆధారాలు

తెలుగుజాతి ఘనమైన చరిత్రకు నాణేలే అసలైన ఆధారాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ అన్నారు. మొగల్రాజపురంలోని ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ విభాగమైన కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతిలో

Published : 23 Jan 2022 03:39 IST

బపమనీ నాణేలు పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న రచయిత జేవీఎస్‌వీ ప్రసాద్‌, గోళ్ల నారాయణరావు, మండలి

బుద్ధ ప్రసాద్‌, ఈమని శివనాగిరెడ్డి, గుమ్మా సాంబశివరావు, మొవ్వా శ్రీనివాసరెడ్డి, ఎంవీఎస్‌ శాస్త్రి

మొగల్రాజపురం(విజయవాడ సిటీ), న్యూస్‌టుడే: తెలుగుజాతి ఘనమైన చరిత్రకు నాణేలే అసలైన ఆధారాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ అన్నారు. మొగల్రాజపురంలోని ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ విభాగమైన కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ, అమరావతిలో శనివారం జేవీఎస్‌వీ ప్రసాద్‌ రచించిన ‘బహమనీ నాణేలు’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బుద్ధప్రసాద్‌ మాట్లాడుతూ బహమనీలు అనేక రకాల నాణేలు వినియోగంలోకి తీసుకొచ్చారన్నారు. పుస్తకాన్ని సమీక్షించిన చరిత్రోపాధ్యాయులు మొవ్వ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ 200 ఏళ్లు పాలించిన బహమనీలు నాణేల ద్వారా ద్రవ్యాన్ని విరివిగా చలామణీలోకి తెచ్చారని వెల్లడించారు. సభకు అధ్యక్షత వహించిన ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈవో శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఈ పుస్తకాలు తెలుగు చరిత్ర పరిశోధకులకు ఎంతో ఉపకరిస్తాయన్నారు.ఆంధ్రాఆర్ట్సు అకాడమీ అధ్యక్షుడు గోళ్ళ నారాయణరావు, విశ్రాంత ఆచార్యులు గుమ్మా సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం రచయిత జేవీఎస్‌వీ ప్రసాద్‌ను అతిథులు సత్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని