logo

నగర వీధుల్లోనూ గణతంత్ర శకటాల ప్రదర్శన

ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు కొవిడ్‌ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే అతిథులను అనుమతిస్తున్నందున, ప్రజలు వీక్షించే విధంగా నగర వీధుల్లో కూడా శకటాల ప్రదర్శనకు

Published : 23 Jan 2022 03:39 IST

అధికారులకు సూచనలు చేస్తున్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నెల 26న జరిగే గణతంత్ర వేడుకలకు కొవిడ్‌ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలోనే అతిథులను అనుమతిస్తున్నందున, ప్రజలు వీక్షించే విధంగా నగర వీధుల్లో కూడా శకటాల ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. స్టేడియంలో రూపొందుతున్న శకటాలను శనివారం ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. త్వరితగతిన సిద్ధం చేయాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను  16 శకటాలపై ప్రదర్శిస్తామని వివరించారు. సమాచార పౌర సంబంధాలశాఖ సంయుక్త సంచాలకుడు కిరణ్‌కుమార్‌, సహాయ సంచాలకుడు భాస్కర్‌ నారాయణ, జిల్లా పౌరసంబంధాల అధికారి ఎస్‌వీ మోహన్‌రావు, ఆయా శకటాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని