logo

ఉద్యోగులకు కార్మిక సంఘాల మద్దతు

ఉద్యోగులు ఈ నెల 29వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిర్వహించే ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటున్నట్లు రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు. ఉద్యోగులకు తమ మద్దతు ఉంటుందని

Published : 23 Jan 2022 03:39 IST

సమావేశమైన కార్మిక సంఘాల నాయకులు ఓబులేసు,
రవీంద్రనాథ్‌, నాగేశ్వరరావు, బాలకాశి, పోలారీ, తాతయ్య

విజయవాడ(అలంకార్‌కూడలి), న్యూస్‌టుడే : ఉద్యోగులు ఈ నెల 29వ తేదీన కలెక్టరేట్ల వద్ద నిర్వహించే ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొంటున్నట్లు రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు ప్రకటించారు. ఉద్యోగులకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. శనివారం విజయవాడ దాసరిభవన్‌లో రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక కమిటీ నాయకుడు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. వారి పోరాటం న్యాయమైనదని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. సార్వత్రిక సమ్మె జయప్రదానికి ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో సదస్సులు నిర్వహిస్తున్నామని వివరించారు. సమావేశంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక కమిటీ నాయకులు రావులపల్లి రవీంద్రనాథ్‌, టి.తాతయ్య, ఎ.వి.నాగేశ్వరరావు, ఎం.బాలకాశి, సుధీర్‌, కుటుంబరావు, రవీంద్ర, పోలారి, శేషగిరిరావు, ఉదయ్‌కిరణ్‌, జాస్తీ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు