logo

ప్రకృతిలో వ్యాయామం.. ఆరోగ్యానికి దోహదం

‘మందుల కన్నా.. ప్రకృతిలో రోజువారీ వ్యాయామం మిన్న’ అని డాక్టర్‌ సూర్యప్రకాష్‌ అన్నారు. అవార(అమరావతి వాకర్స్‌, రన్నర్స్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కృష్ణానదీ తీరంలోని రాజధాని గ్రామ పంట పొలాల మధ్య నిర్వహించిన పరుగును

Published : 24 Jan 2022 04:12 IST


చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న డాక్టర్‌ సూర్యప్రకాష్‌

విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ‘మందుల కన్నా.. ప్రకృతిలో రోజువారీ వ్యాయామం మిన్న’ అని డాక్టర్‌ సూర్యప్రకాష్‌ అన్నారు. అవార(అమరావతి వాకర్స్‌, రన్నర్స్‌ అసోసియేషన్‌) ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం కృష్ణానదీ తీరంలోని రాజధాని గ్రామ పంట పొలాల మధ్య నిర్వహించిన పరుగును పలువురు రన్నర్లు విజయవంతంగా ముగించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ సూర్యప్రకాష్‌ మాట్లాడుతూ దేశంలో కొవిడ్‌ మూడో దశ విజృంభిస్తున్నా క్రమ పద్ధతిలో రోజువారీ వ్యాయామం చేసే పిల్లల్లో, పెద్దల్లో, అదీ ప్రకృతిలో కొనసాగించే వారిలో దాని ప్రభావం పెద్దగా కనపడడం లేదన్నారు. అవార వ్యవస్థాపకుడు, పర్యావరణ వేత్త ప్రొఫెసర్‌ అజయ్‌ కాట్రగడ్డ మాట్లాడుతూ నిర్విఘ్నంగా ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు. 3 కి.మీ., 15 కి.మీ. పరుగు పూర్తిచేసిన రన్నర్‌ వెంకటేష్‌ను, చిన్నారులను అభినందించారు. యోగాను పంకజ్‌, కరాటేను సుదర్శన్‌, సహజ ఆహార పద్ధతులను సుభాష్‌ పరిచయం చేశారు. ‘ప్రకృతిలో పిల్లలు’ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆసక్తిగలవారు 94941 26812 నంబరులో సంప్రదించాలని సూచించారు. ఉపాధ్యాయులు షారోన్‌, ధనుంజయ్‌, శకుంతలాదేవి, వైష్ణవి, స్వప్న, కిరణ్‌, పలువురు ప్రభుత్వోద్యోగులు, ప్రజలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని