logo

వైకాపాది ఆటవిక పాలన

రాష్ట్రంలో వైకాపా ఆటవిక పాలన సాగిస్తోందని భాజపా రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. తమ పార్టీ అన్ని మతాలు, కులాలను గౌరవిస్తుందని, కులాల పేరిట రాజకీయాలు చేసేది వైకాపానేనని మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల ముసుగులో

Published : 24 Jan 2022 04:12 IST

ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో వైకాపా ఆటవిక పాలన సాగిస్తోందని భాజపా రాష్ట్ర కార్యదర్శి మాగంటి సుధాకర్‌యాదవ్‌ ధ్వజమెత్తారు. తమ పార్టీ అన్ని మతాలు, కులాలను గౌరవిస్తుందని, కులాల పేరిట రాజకీయాలు చేసేది వైకాపానేనని మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల ముసుగులో వైకాపా మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సాక్షాత్తు భాజపా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న సోము వీర్రాజును సారాయి వీర్రాజుగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సంబోధించటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. మంత్రి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడుతున్నారని, ఆయనకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పాలనుకుంటున్నారా అని నిలదీశారు. కర్నూలులో జరిగిన పార్టీ సభలో భాజపా నాయకులు ఎవరిః~ర వ్యక్తిగతంగా దూషించలేదని, పాలనలో ఉన్న లొసుగులు, ఆత్మకూరులో జరిగిన ఘటనలకు సంబంధించి ఇప్పటి దాకా ముద్దాయిలను అరెస్టు చేయలేదని మాట్లాడితే మంత్రికి అంత ఉలికిపాటు ఎందుకని ప్రశ్నించారు. ఆదివారం ఆయన పార్టీ అధికార ప్రతినిధి చందుసాంబశివరావుతో కలిసి గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలపై ప్రశ్నించే గొంతుకలను వైకాపా మంత్రులు, నాయకులు బెదిరించి నోళ్లు మూయించాలని చూస్తున్నారని విమర్శించారు. పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు మాట్లాడుతూ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ సోము వీర్రాజు వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా కించపరిచేలా మాట్లాడారని, ఆయన రాజకీయ జీవితం ఏయే పార్టీల్లో కొనసాగిందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ‘మద్యం పాలసీపై మా నాయకుడు మాట్లాడితే దాన్ని చిలువలు పలవలు చేసి మాట్లాడుతున్నారు. మీరిచ్చిన మద్యపాన నిషేధం హామీ ఏమైంది? రేట్లు పెంచి తిరిగి ఎందుకు తగ్గించారు? ఇది మడమ తిప్పటం కాదా’ అని ప్రశ్నించారు. మీడియా ఇన్‌ఛార్జి వెలగలేటి గంగాధర్‌, భజరంగ రామకృష్ణ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని