logo

నాలుగు రోజుల్లో 4,790 కేసులు

జిల్లాలో కరోనా మూడో దశ విరుచుకుపడుతోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 4,790 కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గతంతో పోలిస్తే ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి

Published : 24 Jan 2022 04:12 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో కరోనా మూడో దశ విరుచుకుపడుతోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 4,790 కేసులు నమోదయ్యాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. గతంతో పోలిస్తే ఇప్పుడు వైరస్‌ వ్యాప్తి అత్యంత వేగంగా, తీవ్రంగా ఉండడంతో తక్కువ రోజుల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో జిల్లా వ్యాప్తంగా 1,458 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. జిల్లాలో నమోదైన కొత్త కేసుల్లో 69.82 శాతం కేసులు గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి, నరసరావుపేట, తెనాలి పరిధిలోనే వచ్చాయి. రోజురోజుకు ఇక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్య పెరుగుతోంది. అందువల్ల ఈ ప్రాంతాల్లో కరోనా కట్టడికి కఠినమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని