logo

బాలికతో వ్యభిచారం కేసులో కీలక మలుపు

గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరుతో పాటు హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఓ బాలికతో వ్యభిచారం చేయించినట్లు ఇటీవల అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెల్సిందే. రిమాండ్‌ రిపోర్టులో కొందరి పేర్లే ఉన్నాయని, మరికొందరి

Published : 24 Jan 2022 04:12 IST
జడ్జికి ఇచ్చిన వాంగ్మూలంలో మరికొందరి పేర్లు
పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

ఈనాడు-అమరావతి: గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరుతో పాటు హైదరాబాద్‌ ప్రాంతాల్లో ఓ బాలికతో వ్యభిచారం చేయించినట్లు ఇటీవల అరండల్‌పేట పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెల్సిందే. రిమాండ్‌ రిపోర్టులో కొందరి పేర్లే ఉన్నాయని, మరికొందరి పేర్లు అందులో లేవని, వారి వద్దకు తనను పంపినట్లు ఆ బాలిక జడ్జికి వాంగ్మూలం ఇచ్చినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఈ కేసు ప్రస్తుతం అనేక మలుపులు తిరుగుతోంది. మిగిలిన వ్యభిచార నిర్వాహకులు, విటులను పట్టుకోవాలని జడ్జి ఆదేశించారు. దీంతో అరండల్‌పేట పోలీసులు నిందితుల కోసం పలు ప్రాంతాలకు వెళ్లి ఆరా తీస్తున్నారు.

కేసు పూర్వాపరాలు...

ఈ కేసులో బాధితురాలైన బాలిక, ఆమె తల్లి ఇద్దరూ గతేడాది జూన్‌లో కరోనా వైరస్‌బారిన పడి జీజీహెచ్‌లో చేరారు. చికిత్స పొందుతూ తల్లి చనిపోయింది. ఆ బాలిక ఆలన, పాలన తండ్రే చూస్తున్నారు. అప్పట్లో ఆసుపత్రిలో పరిచయమైన ఓ మహిళ తనకు పిల్లలు లేరని, కరోనా తగ్గుముఖానికి నాటు వైద్యం చేయిస్తానని బాలిక తండ్రికి మాయమాటలు చెప్పి ఆ బాలికను తీసుకెళ్లింది. కొద్దిరోజుల అనంతరం ఆ బాలికను గుంటూరు, నెల్లూరు, విజయవాడలోని వ్యభిచార గృహాలకు తీసుకెళ్లి బలవంతంగా వ్యభిచారం చేయించింది. ఈ క్రమంలో ఒక రోజు విజయవాడ నుంచి తప్పించుకుని ఆ బాలిక పేరేచర్లలో ఉంటున్న తండ్రి వద్దకు వచ్చి తనను ఇంట్లో బంధించి వ్యభిచారం చేయించినట్లు చెప్పడంతో మేడికొండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును ఆ తర్వాత అరండల్‌పేటకు బదిలీ చేశారు. ఆ బాలిక కొత్తగా చెప్పిన వారందరిని పట్టుకురావాలని ఆదేశించటంతో స్టేషన్‌లో ఎస్సైలు బృందంగా ఏర్పడి వేర్వేరు ప్రాంతాల్లో వ్యభిచార నిర్వాహకులు, విటుల కోసం గాలిస్తున్నారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని