logo

విధి రాతతో విడిపోయి...

ఆరేళ్ల వయస్సులో ఇంటి నుంచి తప్పిపోయిన బాలిక వయసు ప్రస్తుతం 28 ఏళ్లు. ఊరు పేరు తెలియకపోవడంతో తల్లిదండ్రులను కలుసుకునేందుకు పరితపిస్తోంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఓ సిమెంట్స్‌ కర్మాగారం ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్న

Published : 24 Jan 2022 05:18 IST

22 ఏళ్లుగా ఓ యువతి ఎదురుచూపులు...

దుర్గ

దామరచర్ల, న్యూస్‌టుడే: ఆరేళ్ల వయస్సులో ఇంటి నుంచి తప్పిపోయిన బాలిక వయసు ప్రస్తుతం 28 ఏళ్లు. ఊరు పేరు తెలియకపోవడంతో తల్లిదండ్రులను కలుసుకునేందుకు పరితపిస్తోంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఓ సిమెంట్స్‌ కర్మాగారం ఆసుపత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తున్న ఆమె ఉదంతం సినిమా కథను తలపిస్తోంది. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘నా పేరు దుర్గ. మాది ఏపీ ప్రాంతం. మా గ్రామం పక్కనే రైల్వేస్టేషన్‌ ఉండేది. నేను ఆరేళ్ల వయస్సులో రైలును చూడాలనే కోరికతో స్టేషన్‌ వద్దకు వచ్చి ఆగి ఉన్న రైలును ఎక్కాను. రైలు ముందుకు సాగింది. రైలు దిగలేక అందులోనే ఉండిపోయి ఏడుస్తూ నిద్రపోయాను. కాచిగూడ స్టేషన్‌లో దిగగా.. రైల్వేపోలీసులు వివరాలు అడగ్గా చెప్పలేకపోయాను. సమీప పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు కాచిగూడ మిషనరీ హోంకు తరలించారు. అప్పటి నుంచి అక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నా. తల్లిదండ్రులు త్రివేణి, ఆంజనేయులు కాగా అక్కా చెల్లెళ్లు వెంకటలక్ష్మి, మంగ, లలిత పేర్లు మరిచిపోకుండా ఉండేందుకు నోట్సులో రాసుకున్నా. బీఎసీ్సీ నర్సింగు పూర్తి చేసిన నాకు మిషనరీ నిర్వాహకులు గతేడాది వివాహం జరిపారు. భర్త అశ్వనీకుమార్‌. దామరచర్లలోని ఓ లారీ ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులను ఏనాటికైనా కలుసుకుంటాను’’ అనే అభిలాషను వ్యక్తం చేస్తున్నారు దుర్గ. ఆ దిశగా కొన్నాళ్ల నుంచి వీలైనన్ని మార్గాలలో ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని