logo

ధర లేక దిగాలు

అరటి రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక.. గెలలను చెట్లమీద, కోసిన గెలలను పొలంలో పెట్టుకుని దిగాలుగా ఉన్నారు. రూ.లక్షలు పెట్టి పండించిన పంటకు ధర లేక కాయలన్నీ పొలంలోనే పండిపోయి కుళ్లిపోతుంటే.. దీనంగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Published : 24 Jan 2022 05:18 IST

రటి రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక.. గెలలను చెట్లమీద, కోసిన గెలలను పొలంలో పెట్టుకుని దిగాలుగా ఉన్నారు. రూ.లక్షలు పెట్టి పండించిన పంటకు ధర లేక కాయలన్నీ పొలంలోనే పండిపోయి కుళ్లిపోతుంటే.. దీనంగా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గోశాలకు చెందిన పూర్ణచంద్రరావు 8 ఎకరాలను కౌలుకు తీసుకుని రూ.8లక్షలతో అరటి పంట సాగు చేశారు. పంట బాగా పండిందని.. అమ్ముదామంటే.. మార్కెట్లో గెల రూ.50 కూడా అమ్ముడుపోలేదని వాపోతున్నారు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడి ఖర్చులు, 35వేలు కౌలు చెల్లించాలని అంటున్నారు. ఇప్పటి ధరకు ఎకరాకు రూ.50వేలు కూడా వచ్చే పరిస్థితి లేదని అంటున్నారు. రెండేళ్ల నుంచి ధరలు ఇలాగే ఉన్నాయని.. ఏటా రూ.4లక్షల అప్పులవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని