logo

నగరంలో రౌడీ బాయ్స్‌ సందడి

రౌడీ బాయ్స్‌ చిత్రం విజయం ప్రేక్షకులదేనని హీరో అశిష్‌ అన్నారు. జీ3 సమర్పణలో శ్రీహర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రౌడీబాయ్స్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆదివారం విజయవాడలో సందడి చేశారు. గాంధీనగర్‌ శైలజా థియేటర్‌ను సందర్శించి, ప్రేక్షకుల మధ్య

Published : 24 Jan 2022 05:41 IST

మాట్లాడుతున్న హీరో అశిష్‌

గాంధీనగర్‌, న్యూస్‌టుడే : రౌడీ బాయ్స్‌ చిత్రం విజయం ప్రేక్షకులదేనని హీరో అశిష్‌ అన్నారు. జీ3 సమర్పణలో శ్రీహర్ష దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రౌడీబాయ్స్‌ చిత్ర యూనిట్‌ సభ్యులు ఆదివారం విజయవాడలో సందడి చేశారు. గాంధీనగర్‌ శైలజా థియేటర్‌ను సందర్శించి, ప్రేక్షకుల మధ్య తమ విజయానందాన్ని పంచుకున్నారు. హీరో అశిష్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెంటర్ల నుంచి మంచి టాక్‌ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏ సినిమా అయినా విజయవాడలో హిట్‌ టాక్‌ వస్తే.. ఆ చిత్రం ఘన విజయం తథ్యమన్నారు. కార్యక్రమంలో సహ నిర్మాణ హర్షత్‌రెడ్డి, యూనిట్‌ సభ్యులు, థియేటర్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని