logo

ఎంబీబీఎస్‌ నోటిఫికేషన్‌ మరింత జాప్యం

రాష్ట్రంలోని పలు వైద్య, దంత కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్‌ మరింత జాప్యం కానుంది. ఇప్పటికే

Published : 28 Jan 2022 02:08 IST

నేటి నుంచి మెడికల్‌ పీజీ సీట్ల కేటాయింపులు

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని పలు వైద్య, దంత కళాశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల ప్రవేశానికి సంబంధించి నోటిఫికేషన్‌ మరింత జాప్యం కానుంది. ఇప్పటికే ఈడబ్ల్యుఎస్‌పై స్పష్టత ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవోల విడుదల  ఆలస్యమవుతోంది. నీట్‌ ర్యాంకుల ఆధారంగా నిర్వహించే నోటిఫికేషన్‌ వచ్చే వారంలో విడుదల చేసేందుకు విజయవాడ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపున నీట్‌ పీజీ వైద్య ఎండీ/ఎంస్‌ కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల నుంచి ఆప్షన్ల ప్రక్రియ ముగియగా శుక్రవారం నుంచి సీట్ల కేటాయింపు ప్రారంభమవుతోంది. గత ఏడాది భర్తీ చేసిన 2158 సీట్లకు అదనంగా ఈ ఏడాది 166 సీట్లు కలిశాయి. మొత్తం సీట్లను సీట్‌మ్యాట్రిక్స్‌లో పొందుపర్చారు. ప్రక్రియలో భాగంగా తొలుత సర్వీస్‌ కేటగిరీ అభ్యర్థులకు కేటాయించాలి. ఈ ఏడాది కొత్తగా క్లినికల్‌ విభాగాల్లో 30శాతం, నాన్‌ క్లినికల్‌ విభాగాల్లో 50 శాతం సీట్లను సర్వీస్‌ కేటగిరీ అభ్యర్థులకు ఇవ్వాలి. కానీ నీట్‌ పీజీ ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన సర్వీస్‌ కేటగిరీ అభ్యర్థుల సంఖ్య తగ్గడంతో మిగిలిన వాటిని ఏ విధంగా భర్తీ చేయాలో అని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని