logo

అందరి సహకారంతో నగరాభివృద్ధికి కృషి

అందరి సహకారంతో విజయవాడ నగరాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నూతన కమిషనర్‌ రంజిత్‌ బాషా వెల్లడించారు. నగరపాలక సంస్థ 26వ కమిషనర్‌గా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11

Published : 28 Jan 2022 04:53 IST

నూతన కమిషనర్‌ రంజిత్‌ బాషా బాధ్యతల స్వీకరణ

సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న కమిషనర్‌

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: అందరి సహకారంతో విజయవాడ నగరాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని నూతన కమిషనర్‌ రంజిత్‌ బాషా వెల్లడించారు. నగరపాలక సంస్థ 26వ కమిషనర్‌గా ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11.30 గంటలకు నగరపాలక సంస్థ ప్రాంగణానికి చేరుకున్న ఆయనకు అన్ని విభాగాల ప్రధాన అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలిగారు. తర్వాత ఆయన తన కార్యాలయంలోకి చేరుకుని 11.40 గంటలకు దస్త్రంపై సంతకాలు చేశారు. అనంతరం కమిషనర్‌ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాతో తనకు అనుబంధం ఉందని, ఇప్పటికే తాను గుడివాడ ఆర్డీవోగా పనిచేశానని గుర్తుచేశారు. మరోవైపు 4-5 ఏళ్లగా నగరంలోనే తాను నివాసం ఉంటున్నందున ఇక్కడ పరిస్థితులపై తనకు పూర్తి అవగాహన ఉందని వెల్లడించారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, అందరి సహకారంతో నగరాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు అనువైన అన్ని చర్యలు తీసుకుంటానని తెలిపారు. పథకాలను అర్హులైన పేదలకు అందేలా చూడడంతో పాటు, నగరాన్ని పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తానని వెల్లడించారు. ప్రజారోగ్యం, విద్యావిషయక అంశాలపై తాను ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెప్పారు. ఆపై వివిధ విభాగాల అధికారులు, ఉప మేయర్‌ అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేషన్‌ గుత్తేదార్లు, పలువురు ప్రజాప్రతినిధులు కమిషనర్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తేగా, అన్ని విషయాలు తెలుసుకుని పరిష్కరిస్తానని పేర్కొన్నారు. అదనపు కమిషనర్‌ జె.అరుణ, ఇతర అధికారులు ఉన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన నూతన కమిషనర్‌

విజయవాడ నగరపాలక సంస్థ, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ నూతన కమిషనర్‌గా గురువారం బాధ్యతలు చేపట్టిన రంజిత్‌ బాషా సాయంత్రం   ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు.

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని