logo

అవినీతి రహితంగా సేవలందేలా చూస్తా

ప్రజలకు నగరపాలకసంస్థ నుంచి అందించే సేవలు అవినీతి రహితంగా అందేలా చూడటంతోపాటు.. సిటిజన్‌ ఫ్రెండ్లీగా పాలన మార్చనున్నట్లు గుంటూరు నగరపాలకసంస్థ నూతన కమిషనర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. గురువారం ఆయన

Published : 28 Jan 2022 02:37 IST

జీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన నిశాంత్‌కుమార్‌

నగరపాలకసంస్థ(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రజలకు నగరపాలకసంస్థ నుంచి అందించే సేవలు అవినీతి రహితంగా అందేలా చూడటంతోపాటు.. సిటిజన్‌ ఫ్రెండ్లీగా పాలన మార్చనున్నట్లు గుంటూరు నగరపాలకసంస్థ నూతన కమిషనర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. గురువారం ఆయన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా కమిషనర్‌ ఛాంబర్‌కు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం దస్త్రాలపై సంతకాలు చేసి ఛార్జి తీసుకున్నారు. ఈసందర్భంగా నిశాంత్‌కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ నగరంలో అనేక సమస్యలు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. పారిశుద్ధ్యం మెరుగు పరచాల్సిన అవసరం ఉందని, గతేడాది మలేరియా, డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయయని వాటిని నియంత్రించేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాకాలం లోపు ముందుస్తు కార్యాచరణ అమలు చేస్తామని తెలిపారు. వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూగర్భ మురుగుపారుదల పనులతో పాడైన రహదార్లకు మరమ్మతులు చేయడంతోపాటు మధ్యలో ఆగిన పనులు పునర్‌ ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. నగరవాసులకు మౌలిక సదుపాయాల కల్పించేలా చూస్తానని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ప్రతి అర్హునికి సక్రమంగా చేర్చేలా ప్రాధాన్యం ఉంటుందన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాసంఘాల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని నగర సమగ్రాభివృద్ధికి చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ ఇతర విభాగాల వారీగా సమీక్షించి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేసి అమలు చేయున్నట్లు చెప్పారు. విభాగాల వారీగా దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారి వివరాలు తెప్పించుకుని పనితీరు మెరుగుపడేలా చర్యలు ఉంటాయని తెలిపారు. ఖాళీగా ఉన్న పోస్టుల గురించి పురపాలక ముఖ్య కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత త్వరలో పోస్టింగ్‌లు వచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని