logo

కొచ్చెర్లలో మూడు వ్యాపార దుకాణాల్లో చోరీ

మండలంలోని కొచ్చెర్లలో బుధవారం రాత్రి వరుసగా మూడు దుకాణాల్లో చోరీలు చేశారు. మొదట మాదాల నరేష్‌ దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. దుకాణం బయట గేటుకున్న తాళం రాకపోవడంతో చోరీ చేయలేదు. అనంతరం మాదాల

Published : 28 Jan 2022 02:37 IST

ఆధారాలను పరిశీలిస్తున్న క్లూస్‌టీం

ఈపూరు, న్యూస్‌టుడే : మండలంలోని కొచ్చెర్లలో బుధవారం రాత్రి వరుసగా మూడు దుకాణాల్లో చోరీలు చేశారు. మొదట మాదాల నరేష్‌ దుకాణంలో చోరీకి విఫలయత్నం చేశారు. దుకాణం బయట గేటుకున్న తాళం రాకపోవడంతో చోరీ చేయలేదు. అనంతరం మాదాల వెంకటేష్‌కు చెందిన ఫ్యాన్సీ దుకాణం బయట గేటు తాళం పగులగొట్టి  దొంగలు లోపలకు ప్రవేశించారు. ఇక్కడ వివిధ ప్రదేశాల్లో దాచిపెట్టిన రూ.45 వేల నగదు, మూడున్నర శవర్ల బంగారు నానుతాడును చోరీ చేశారు. అనంతరం మండలవ లక్ష్మయ్యకు చెందిన ఇంట్లో పక్కనే ఉన్న చిల్లర దుకాణంలో చొరబడ్డారు. అందులో రూ.800 నగదు, ఇంట్లో రూ.300 నగదు, మనీ పర్సు తీసుకుని వెళ్లారు. అందులో ఏటీఎం కార్డులు, రూ.150 ఉన్నట్లు బాధితుడు తెలిపారు. అనంతరం పక్కనే ఉన్న మండవ సుబ్బారావు దుకాణంలో చోరీ చేశారు. ఇక్కడ రూ.3 వేలు నగదును ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న ఎస్సై విప్పర్ల వెంకటరావు గురువారం ఉదయం కొచ్చెర్ల వెళ్లి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. క్లూస్‌టీం వచ్చి ఆధారాలను సేకరించింది. ఈ సందర్భంగా ఒక ఇంట్లో కొన్ని వేలిముద్రలు దొరికాయని, ఇంకా మరిన్ని ఆధారాల కోసం ఇతర కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలో దొంగలను పట్టుకుంటామని ఎస్సై వెంకటరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని