logo

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

కొత్తగా నిర్మిస్తున్న కోల్డ్‌ స్టోరేజ్‌లో కూలీలు పనిచేస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో త్రుటిలో ప్రాణ నష్టం తప్పింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు.

Published : 28 Jan 2022 02:37 IST

భవనాన్ని కమ్ముకున్న పొగ

మేడికొండూరు, న్యూస్‌టుడే: కొత్తగా నిర్మిస్తున్న కోల్డ్‌ స్టోరేజ్‌లో కూలీలు పనిచేస్తుండగా జరిగిన అగ్ని ప్రమాదంలో త్రుటిలో ప్రాణ నష్టం తప్పింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణ భయంతో పరుగులు తీశారు. అందరూ బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన మేడికొండూరు మండలంలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. మండలంలోని పాలడుగు అడ్డరోడ్డులో నూతనంగా కోల్డ్‌స్టోరేజ్‌ నిర్మిస్తున్నారు. అందులో ఆరు అంతస్తులుగా గోదాము ఏర్పాటు చేస్తున్నారు. ఐదో అంతస్తులో థర్మల్‌ కూల్‌ అట్టలు ఏర్పాటు చేసేందుకు కార్మికులు ఇనుప రాడ్లు వెల్డింగ్‌ చేస్తున్నారు. ఆ సమయంలో నిప్పు రవ్వలు పైకి ఎగసి థర్మల్‌ కూల్‌ అట్టలపై పడడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి పొగ కమ్ముకుంది. కూలీలు పరుగులు పెట్టారు. ఒక కూలీ ప్రాణ భయంతో ఐదో అంతస్తు పైనుంచి కింద ఉన్న ఇసుక కుప్పపై దూకాడు. గాయాలవడంతో అతడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకొని సత్తెనపల్లి నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులో తెచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని