logo

పాలనలో... నవశకం

గుంటూరు, నరసరావుపేట, బాపట్ల కేంద్రాలుగా నేడు మూడు కొత్త జిల్లాలు ఆవిర్భావానికి తెర లేచింది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జీవో విడుదల చేసింది.

Published : 04 Apr 2022 03:57 IST

ఈనాడు,గుంటూరు

గుంటూరు, నరసరావుపేట, బాపట్ల కేంద్రాలుగా నేడు మూడు కొత్త జిల్లాలు ఆవిర్భావానికి తెర లేచింది. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి తుది ప్రకటనను రాష్ట్ర ప్రభుత్వం శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత జీవో విడుదల చేసింది. వెనువెంటనే కొత్త జిల్లాలకు పాలనాధికారులను నియమిస్తూ జీవోలు జారీ అయ్యాయి. ఆదివారం ఉదయం గుంటూరు, బాపట్ల, నరసరావుపేట ఎస్పీలుగా ఆరీఫ్‌ హఫీజ్‌, వకుల్‌ జిందాల్‌, రవిశంకర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సంయుక్త కలెక్టర్లు, ఆర్డీవోలు, జిల్లా స్థాయి అధికారులు నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. సోమవారం ఉదయం నూతన కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి లాంఛనంగా జిల్లాలను ప్రారంభించనున్నారు. సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా.. అన్ని రంగాల్లో ముందుండే గుంటూరు జిల్లా ప్రాంతం మూడు జిల్లాలుగా విడివడి మరింత పురోగతి సాధించనుంది. వెనుకబడిన పల్నాడు ప్రాంతం ఇకపై అభివృద్ధి బాటపట్టనుంది. విస్తారమైన తీర ప్రాంతం ఉన్న బాపట్ల జిల్లా పురోగమనంలో పయనించనుంది. రెండు నగరపాలక సంస్థలున్న గుంటూరు ప్రాంతంలో ప్రగతి పరుగులు పెట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని