logo

జిల్లా అంతటా.. జడివాన

నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లా అంతటా రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతమైంది. జడివాన పట్టుకుంది. నేలంతా తడిసి చిత్తడి చిత్తడిగా ఉంది. వాతావరణం పూర్తిగా చల్లబడింది. పొలం పనులు సాగక ఇబ్బందిగా మారింది.

Published : 13 Jun 2024 02:27 IST

అనంతపురం(వ్యవసాయం) : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జిల్లా అంతటా రెండ్రోజులుగా ఆకాశం మేఘావృతమైంది. జడివాన పట్టుకుంది. నేలంతా తడిసి చిత్తడి చిత్తడిగా ఉంది. వాతావరణం పూర్తిగా చల్లబడింది. పొలం పనులు సాగక ఇబ్బందిగా మారింది. వర్షం తెరపివ్వక టమాటా నాటుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. టమాటా, పత్తి చేలల్లో నీరు నిలిచి వేర్లు కుళ్లి మొక్కలు ఎండిపోతున్నాయి. కర్బూజా, కలింగర వంటి పంటలకు బూజు తెగులు ఆశిస్తోందని, మందులు పిచికారీ చేసుకుందామన్నా వర్షం ఆగడంలేదు. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈనెల 11, 12 తేదీల్లో నిరంతరాయంగా రాత్రి, పగలు జిల్లా అంతటా కురిసింది. మంగళవారం రాత్రి వర్షపాతం పరిశీలిస్తే.. పామిడి మండలంలో 31.2, వజ్రకరూరులో 26.2, గుమ్మఘట్టలో 23.4, కణేకల్లులో 21.0, విడపనకల్లు, తాడిపత్రి మండలాల్లో 18.6 మి.మీల చొప్పున, పుట్లూరులో 14.2, నార్పలలో 10.6, శెట్టూరులో 10.3 మిమీ నమోదైంది. ఉరవకొండ, కుందుర్పి, కూడేరు, యల్లనూరు, అనంతపురం గ్రామీణం, డీ… హీరేహాళ్, బుక్కరాయసముద్రం, కంబదూరు, బ్రహ్మసముద్రం, పెద్దవడుగూరు, రాయదుర్గం, అనంతపురం అర్బన్, బెళుగుప్ప, బొమ్మనహాళ్, పెద్దపప్పూరు, గుత్తి, గార్లదిన్నె, గుంతకల్లు, యాడికి శింగనమల, రాప్తాడు మండలాల్లో చిరుజల్లులు పడ్డాయని జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి అశోక్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని