logo

వైభవం.. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కల్యాణం

ప్రసిద్ధి చెందిన పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి విశేషంగా పాలాభిషేకం, పంచామృతాభిషేకం, ఆకుపూజ కార్యక్రమాలను చేశారు.

Published : 13 Jun 2024 02:28 IST

ఆత్మకూరు, న్యూస్‌టుడే: ప్రసిద్ధి చెందిన పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్టి సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కల్యాణాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి విశేషంగా పాలాభిషేకం, పంచామృతాభిషేకం, ఆకుపూజ కార్యక్రమాలను చేశారు. వేద పండితుల నడుమ కల్యాణం అంగరంగ వైభవంగా సాగింది. మధ్యాహ్నం స్వామి వారికి పల్లకీసేవ, రథోత్సవాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని తరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని