logo

ఆర్టీసీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణంపై విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

Published : 13 Jun 2024 02:30 IST

జిల్లా సచివాలయం, న్యూస్‌టుడే: జిల్లాలో ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణంపై విస్తృత ప్రచారం చేపట్టాలని కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో ఆర్టీసీ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ పురోగతిపై మరింత శ్రద్ధ పెట్టాలని కలెక్టర్‌ అన్నారు. గతంలో కంటే రెట్టింపు స్థాయిలో ఆదాయం వచ్చేలా సర్వీసుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అనంత నగరం నుంచి హైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాలకు ఓల్వో బస్సులు తిప్పడానికి తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కండక్టర్లు, డ్రైవర్లకు నైపుణ్యంపై మరింత తర్ఫీదు అవసరమని పేర్కొన్నారు. అన్ని రకాల రాయితీ పాసులు, బాలికల పాసులపై సద్వినియోగం చేసుకునేందుకు అవగాహన కల్పించాలన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం సుమంత్, డీపీఓ ప్రభాకర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ ఎహ్‌సాన్‌ బాషా, డ్వామా పీడీ వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని